కలియుగం అంటే ఇదేరా అబ్బాయిలు.మీరు మాత్రమే సెల్ఫీలు ( Selfie ) దిగుతారా? జంతువులకు కూడా అవి కావాలి మరి.అవి కూడా ఇపుడు స్మార్ట్ అయిపోనున్నాయి.తమ అందాలను చూసి అవి మురిసిపోతున్నాయి.
ఇటీవలి కాలంలో చూసుకుంటే ఇటువంటి గమ్మత్తైన విషయాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.ఆమధ్య ఓ ఏనుగుకి సంబంధించిన వీడియో చూసి నవ్వుకున్నాము కదా.ఇపుడు ఆవు వంతు వచ్చింది.

అవును, సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న సదరు వీడియోను చూసిన నెటిజన్లు అది చాలా అందంగా ఉందని, చాలా క్యూట్ సెల్ఫీ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.విషయం ఏమంటే ఇక్కడ వీడియోని చూడండి.అది మరి అతగాడు పెంచుకున్న అవేమో గాని, సెల్ఫీ కోసం ‘స్మైల్ ప్లీజ్’ అని తన ఆవుతో( Cow ) అనగానే ఆ ఆవు ఎంతో అందంగా, క్యూట్‌గా ఫోజులిచ్చింది.
ఈ సెల్ఫీ వీడియోని వివేక్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ చేయగా అది కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే కామెంట్ల రూపంలో తమ స్పందనలతో రెచ్చిపోతున్నారు అని చెప్పుకోవచ్చు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘చాలా మంచి వీడియో.ఇలాంటి ఫ్రెండ్ నాకు కూడా ఉంటే ఎంత బావుంటుంది.సెల్ఫీలే సెల్ఫీలు తీసుకుంటాను.’అని కామెంట్ చేశాడు.మరొకరు అయితే ‘బహుశా ఇది ప్రపంచంలోనే అందమైన సెల్ఫీ అయి ఉండవచ్చు’ అని రాసుకొచ్చాడు.ఇదే రీతిలో అనేక మంది స్పందిస్తూ కొందరు ‘జై గోమాత’ అని, మరికొందరు ‘వందే మాతరం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 4 లక్షల 60 వేలకు పైగా లైకులు, అలాగే 22 లక్షలకు పైగా వీక్షణలు రావడం కొసమెరుపు.







