బేసిగ్గా మనం ఖరీదైన కారు వున్న వ్యక్తులను సంపన్నులుగా పరిగణిస్తాం.అదేవిధంగా వారు హుందాగా నడుచుకుంటారని భ్రమ పడుతూ ఉంటాం.
కానీ కొంతమంది ఎంత సంపద, హోదా ఉన్నా తమ దుర్బుద్ధిని పోనిచ్చుకోరు.సందర్భాన్ని బట్టి బయటపెట్టుకుంటారు.
తాజాగా ఇద్దరు సంపన్నులు ఈ విషయాన్ని నిజం చేస్తూ పూల కుండీలు దొంగతనం చేస్తూ వీడియోకు అడ్డంగా దొరికిపోయారు.అవును, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

గురుగ్రామ్‌లో మార్చి 1-14 వరకు జీ20 గ్రూప్ మీటింగ్ జరగబోతుంది.మీటింగ్ జరిగే హోటల్స్‌తోపాటు, చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లను అందంగా అలంకరించారు.ఈ క్రమంలోనే అనేక చోట్ల కుండీల్లో చాలా పూల మొక్కలు ఏర్పాటు చేశారు.
అయితే, ఈ మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను ఖరీదైన కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దోచుకెళ్లడం అక్కడ ఓ వీడియోలో రికార్డ్ అయింది.వీడియో ప్రకారం.
ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద ఒక కాస్ట్లీ కియా కారును ఆపి, ఆదరాబాదరా కారు డిక్కీ ఓపెన్ చేసి, అందులో రోడ్డు పక్కన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూల కుండీలను పెట్టుకుని వెళ్లిపోయారు.

అయితే ఈ దృశ్యాన్ని అక్కడికి కాస్త దూరంగా వున్నవారు చాలా సైలెంట్ గా వీడియో తీయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజులో యేసుకుంటున్నారు.అంత ఖరీదైన కారు ఉండి పూల కుండీలు ఎత్తుకెళ్తున్నారంటే.
ఆ కారు ఎలా సంపాదించి ఉంటారో ఇక అర్థం చేసుకోవచ్చు అని ఒకరంటే, మరికొందరు కామెంట్ చేస్తూ….ఇలాంటి వారినే పిల్లికి కూడా బిచ్చం పెట్టని వెధవులు అంటరాని తిడుతున్నారు.
ఇక మీరు ఈ వీడియో చూసినట్టైతే మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి.కాగా ఈ వీడియో వైరల్ కావడంతో గురుగ్రామ్ అధికారులు స్పందించి పూల కుండీలు ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.







