ఢిల్లీ నగరంలో రోజు కూలీ పనులు చేసుకునే వ్యక్తి రాత్రి సమయాలలో సైకో కిల్లర్ గా మారి కనిపించిన మైనర్ బాలికలను హత్యాచారం చేసి చంపడం దినచర్యగా మారింది.రాత్రి కాగానే ఢిల్లీ నగరంలోని మురికి వాడలలో మైళ్ళ దూరం నడుస్తూ ఒంటరిగా కనిపించే మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి ఈ దారుణాలకు పాల్పడేవాడు.
చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలు అయ్యాడు.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అవి ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని కాస్ గంజ్ ప్రాంతానికి చెందిన రవీందర్ తనకు 18 ఏళ్ల వయస్సు లో 2008లో ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చాడు.ఆ తర్వాత తాగుడుకు, డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు.
ఇక వీటికి తోడు అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డాడు.ఈ క్రమంలో 2008లో ఢిల్లీలోని కార్ల ప్రాంతానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి, మద్యం మత్తులో అత్యాచారం చేసి చంపేశాడు.
మొదటిసారి చేసిన తప్పు బయటపడకుండా తప్పించుకున్నాడు.

దీంతో పలుసార్లు అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆపై ఆత్యాచారం చేసి చంపేయడమే అలవాటుగా మారింది.ఇక ఉదయం రోజువారి పనులకు వెళ్లడం, చీకటి పడితే మురికివాడల లో ఒంటరిగా కనిపించే మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి నేరాలు చేయడం అలవాటయింది.

2008 నుండి 2015 వరకు ఢిల్లీ, హర్యానా( Haryana ), ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాలలో దాదాపుగా 35 మంది మైనర్ పిల్లలను అత్యాచారం చేసి చంపేశాడు.ఇతని చేతిలో బలి అయిన బాలికల వయసు రెండేళ్ల నుండి 12 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారే.2015లో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో రవీందర్ కుమార్ తొలిసారి పోలీసులకు చిక్కాడు.ఆరు సంవత్సరాల కాలంలో 35 నేరాలు చేశాడు.2015 నుండి 2023 వరకు విచారణ జరిగింది.
తాజాగా కోర్టు రవీందర్ ని ( Ravinder )దోషిగా నిర్ధారించింది.రవీందర్ అత్యాచారాలు చేస్తూ హత్యలు చేశానని అంగీకరించాడు.మరో రెండు వారాల్లో కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేయనుంది.







