మనో ధైర్యం ఉంటే అంగవైకల్యంను ఈజీగానే జయించవచ్చు.ఎంతటి అంగవైకల్యం ఉన్నా కూడా సాధించాలనే పట్టుదల ఉంటే ఆ అంగవైఖల్యం చిన్నదవుతుంది.
ఈ విషయం ఎంతో మంది విషయంలో రుజువు అయ్యింది.తాజాగా మరోసారి ఆ విషయం వీడియో సాక్షిగా రుజువు అయ్యింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది చూసి ఇన్సిపైర్ అవుతున్న వీడియో ఇది.ఇందులో ఒక కుర్రాడు పూర్తిగా కాళ్లు లేవు.అయినా కూడా క్రికెట్ ఆడిన తీరు అందరికి ఆశ్చర్యంను కలిగించింది.
సుధ రామన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఆ వీడియో చాలా మామూలు వీడియో అనుకున్నారు.కాని ఆ వీడియోలో ఒక హీరో ఉన్నాడు.
అతడికి రెండు కాళ్లు లేకున్నా కూడా ఇతర సాదారణ కుర్రాళ్ల మాదిరిగా చాలా బాగా క్రికెట్ ఆడుతున్నాడు.వికెట్ల మద్య పరుగులు తీస్తున్నాడు.
బంతిని బలంగా లాగి పెట్టి కొడుతున్నాడు.అతడి ఆట తీరు ఏమో కాని అతడి పట్టుదలను చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఆమె సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేసి ఈ వీడియో నన్ను మాటలు లేకుండా చేసింది.అతడి ప్రతిభకు నేను ఫిదా అవుతున్నాను.అతడి మనో ధైర్యం పట్టుదలకు హ్యాట్సాప్ అంది.అతడు వికలాంగుడు అయినా కూడా అతడి స్నేహితులు అతడిని టీంలోకి తీసుకోవడంతో వారు కూడా హీరోలు అయ్యారు.అలాంటి వారిని సపోర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో వారు చేసిన పనిని అభినందించకుండా ఉండలేక పోతున్నాను అంటూ ఆమె పోస్ట్ చేసింది.ఈ వీడియోను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది.
ఈ కుర్రాడి గురించి ఎవరికైనా తెలిస్తే సుధ రామన్ మేడమ్ గారికి తెలియజేయండి.ఆమె అతడిని కలుసుకునేందుకు చాలా ఆతృతగా ఉన్నారు.