వర్షాకాలంలో నీరు ఇంకిపోయేందుకు సరికొత్త మార్గం

మన దేశంలో వర్షాకాలం వస్తే చాలు.రోడ్లు అననీ వరద నీటితో నిండిపోయి ఉంటాయి.

 A New Way To Soak Up Water During Monsoons , Winter , Raining , New Features , L-TeluguStop.com

రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిండిపోతుంది.పార్కింగ్ స్థలాలు, వాణిజ్య స్థలాల నుండి నీటి ప్రవాహం లేక చాలా మంది ఇబ్బంది పడతారు.

ఇవి ఎన్నో సమస్యలకు దారి తీస్తాయి.ముఖ్యంగా రోడ్లపై గుంతల్లో నీరు నిండిపోవడం కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడతారు.

లోతట్టు ప్రాంతాలన్నీ నీటి మయం అవుతాయి.ఈ సమస్యకు వరంగల్ నిట్ పరిశోధక విద్యార్థి చిరంజీవి పరిష్కారం చూపాడు.

పోరస్ తారుతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని అతడు చెబుతున్నాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పోరస్ తారుతో ఉపరితలంపై ఉన్న వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోతుంది.పార్కింగ్ స్థలాలు, చదును చేయబడిన రోడ్లు వంటి వాటి చోట సాధారణంగా వర్షపు నీరు నిల్వ ఉండిపోతుంది.

అలాంటి చోట నీరు ఇంకని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.పోరస్ తారు క్రింద ఉన్న పొర నీటిని పీల్చుకోగల, నిల్వ చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లో పోరస్ తారు పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి, డిజైనర్లు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.నేల లక్షణాలు, స్థానిక స్థలాకృతి, వాతావరణం పోరస్ తారు పేవ్‌మెంట్ రూపకల్పనలో తప్పనిసరిగా ఉపయోగించాల్సిన భౌతిక కారకాలు.

అన్ని జాగ్రత్తలు తీసుకుని, పోరస్ తారును ఉపయోగిస్తే ఉపరితలంపై ఉండే నీరు భూమి పొరల్లోకి ఇంకిపోతుంది.సింపుల్‌గా చెప్పాలంటే ఈ వ్యవస్థ ఇంకుడు గుంతలను పోలి ఉంటుంది.

ఇంకుడు గుంతల్లో మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. వరంగల్ నిట్‌లోని సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ శంకర్ పర్యవేక్షణలో చిరంజీవి ఈ పరిశోధన చేస్తున్నాడు.

ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఆదరణ దక్కుతోంది.ఇది అమలులోకి వస్తే, వర్షాకాలంలో నీరు ఉపరితలంపై నిల్వ ఉండే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube