సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు సోషల్ మీడియా యూజర్లను టార్గెట్ చేస్తున్నారు.ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న ఓ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ జెరోధా సీఈవో నిఖిల్ కామత్( Nikhil Kamath ) ఈ సరికొత్త మోసాన్ని బయటపెట్టారు.పిగ్ బుచరింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న సరికొత్త మోసం గురించి నిఖిల్ కామత్ ( Nikhil Kamath )ప్రజలకు అవగాహన కల్పించారు.
పిగ్ అంటే బాధితుడు.బుచరింగ్ అంటే వధించడం.

సైబర్ నేరగాళ్లు ఈ పిగ్ బుచరింగ్( Pig Butchering Scam ) పేరుతో ముందుగా సోషల్ మీడియా అమాయక యూజర్లతో ఫేక్ రిలేషన్ షిప్స్( Fake Relationships ) ఏర్పరచుకుంటారు.ఆ తర్వాత మంచి సమయం చూసుకుని ఈ రిలేషన్ షిప్ ముసుగులో బాధితుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి దారుణంగా మోసం చేసేస్తారు.ఇది స్కాం కాదు.బాధితులను నమ్మించి మోసం చేసే ఒక స్కాంలకు చెందిన కేటగిరీ టెక్నిక్.ఈ తరహా మోసానికి పాల్పడే మోసగాళ్లు ముందుగా స్నేహితులు లేదా లవర్స్ గా నటిస్తూ సోషల్ మీడియా యూజర్ల ( Users )నమ్మకాన్ని గెలుచుకుంటారు.ఆ తర్వాత యూజర్ ప్రవర్తన పై అవగాహన కల్పించుకుని హై శాలరీ లేదా హై రిటర్న్ ( High salary or high return )అందించే పెట్టుబడుల కోసం డబ్బులు అడిగి, భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ తరువాత అదృశ్యం అవుతారు.
ఇలాంటి మోసాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ లక్షల మంది ప్రజలు మోసపోతున్నారు.

మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.సోషల్ మీడియాలో వచ్చే జాబ్ ఆఫర్లను( Job offers ) గుడ్డిగా నమ్మకూడదు.సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లకు అస్సలు రెస్పాండ్ అవ్వకూడదు.
తెలియని ప్రైవేట్ లింకులను( Private links ) ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు.కొత్త కొత్త యాప్లను డౌన్లోడ్ చేయకూడదు.
ఇక అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.ఓటీపీ( OTP ) లేదా ఇతర వ్యక్తిగత వివరాలు అపరిచిత వ్యక్తులకు షేర్ చేయరాదు.
సోషల్ మీడియాలో వచ్చే కథనాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.







