కోవిడ్ మహమ్మారి తర్వాత చాలా మంది వ్యక్తులు తమ ఆరోగ్యం, భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.సాధారణ జీవితాన్ని ఈ కోవిడ్ అతలాకుతలం చేసింది.
ఈ ప్రాణాంతక వైరస్ మానవాళిని ఎలా భయపెట్టిందో చూశాం.కేవలం దగ్గు, తుమ్ముల ద్వారా ప్రపంచంలో చాలా మందికి ఈ వైరస్ వ్యాపించింది.
లక్షల సంఖ్యలో ప్రజలను బలిగొంది.దీంతో చాలా మంది ఇమ్యూనిటీ సిస్టమ్( Immune system) పెంచుకునే ఆహారం తీసుకోవడం ప్రారంభించారు.
అంతేకాకుండా మార్కెట్‌లో వైరస్‌లను అరికట్టే గ్యాడ్జెట్‌లను కొనడంపై దృష్టిసారించారు.ఇదే కోవలో ప్రస్తుతం ఓ స్మార్ట్ వాచ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఇతర స్మార్ట్ వాచ్‌లలో ఉండే ఎన్నో ఫీచర్లు ఇందులోనూ ఉన్నాయి.అయితే అదనంగా వైరస్‌లను కనిపెట్టే సామర్థ్యాన్ని ఓ స్మార్ట్ వాచ్‌లో పొందుపర్చారు.
దీనిపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకుందాం.

అమెరికన్ కంపెనీ ‘డిజైనర్ డాట్( Designer Dot )’ ఇటీవల విక్లోన్ పేరుతో ఓ స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.వైరస్‌ల జాడ గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది.గాలిలో ఉండే వైరస్, ఇతర హానికారకాలను ఇది స్వీకరిస్తుంది.చుట్టు పక్కల గాలి కణాలను ఈ వాచ్‌లోని చిన్న చిన్న గుంటలు పీల్చుకుంటాయి.

ప్రమాదకరమైనవి ఉంటే వెంటనే యూజర్లను అప్రమత్తం చేస్తుంది.తద్వారా ఏవైనా వైరస్‌లు మన సమీపంలో ఉంటే వాటి బారిన పడకుండా మనలను మనం కాపాడుకునే అవకాశం ఉంది.కోవిడ్( Covid ) తర్వాత ఇలాంటి వైరస్‌లు వెలుగు చూసినా అవి మానవాళిపై అంత ప్రభావం చూపలేదు.కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి.అయితే ఇలాంటి స్మార్ట్ వాచ్ మన వెంట ఉంటే ఇక బయటకు వెళ్లినప్పుడు నిర్భయంగా ఉండొచ్చు.ప్రాణాంతక వైరస్‌ల జాడ తెలిస్తే అటు వైపు వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.