హైదరాబాద్ ఓడిన భువనేశ్వర్ కుమార్ ఖాతాలో సరికొత్త రికార్డు..!

ఐపీఎల్( IPL ) సీజన్లో హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచే పేలవ ఆట ప్రదర్శనతో ప్లే ఆఫ్( Playoffs ) ఆశలను గల్లంతు చేసుకుంది.

కొత్త కెప్టెన్ మార్కరమ్( Markram ) కు హైదరాబాద్ అప్పగించిన జట్టు ప్రదర్శనలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు.

ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీ ఇవ్వడంలో హైదరాబాద్ జట్టు పూర్తిగా విఫలమైంది.

A New Record In The Account Of Bhuvneshwar Kumar As Lost To Hyderabad Details, I

తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో బ్యాటర్లను కట్టడి చేయడంలో హైదరాబాద్ జట్టు బౌలర్లు కీలక పాత్ర వహించారు.కానీ బ్యాటింగ్లో మాత్రం హైదరాబాద్ జట్టు పేలవ ఆటను ప్రదర్శించింది.హైదరాబాద్ జట్టు ఓడినప్పటికీ భువనేశ్వర్ కుమార్( Bhuvi ) మాత్రం ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్లో 5 వికెట్లను తీయడంతో పాటు 25 ప్లస్ పరుగులు చేసి రెండవ బౌలర్ గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.గతంలో రవీంద్ర జడేజా డెక్కన్ ఛార్జర్స్ తో ఆడిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడంతో పాటు 48 పరుగులు చేసి రికార్డు మొదటి స్థానంలో ఉంటే, తాజాగా గుజరాత్ తో ఆడిన మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో పాటు 27 పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచాడు.

A New Record In The Account Of Bhuvneshwar Kumar As Lost To Hyderabad Details, I
Advertisement
A New Record In The Account Of Bhuvneshwar Kumar As Lost To Hyderabad Details, I

ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి, ఐదు వికెట్లు తీసుకున్నాడు.అయితే భువనేశ్వర్ కుమార్ కష్టానికి ఫలితం మాత్రం దక్కలేదు.

హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్లో అద్భుతంగానే రాణించింది.కానీ బ్యాటింగ్లో మాత్రం పేలవ ఆట ప్రదర్శన చేసింది.

గుజరాత్ చేతిలో 34 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు ఓటమిని చవిచూసింది.ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకుంది.

ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే ప్లే ఆఫ్ రేస్ కాస్త ఉత్కంఠ భరితంగా సాగేది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు