యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ( YouTube Music App )లో ఆఫ్ లైన్ లో కూడా మ్యూజిక్ వినేందుకు ఓ కొత్త ఫీచర్ ను యూట్యూబ్ అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటివరకు మొబైల్ యాప్ ఆఫ్ లైన్ లో ( offline )ఉన్నప్పుడు మ్యూజిక్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు అనుమతించింది.
కానీ ఇప్పుడు ఈ ఫీచర్ ను డెస్క్ టాప్ యాప్ వినియోగదారులకు కూడా పరిచయం చేసింది.వినియోగదారులు మ్యూజిక్ మరియు ప్లే జాబితాను డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ కనెక్షన్ లేని సమయంలో కూడా సంగీతం వినవచ్చు.
ఇప్పటికే ఈ ఫీచర్ టెస్టింగ్ దశ పూర్తయింది.త్వరలోనే అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.డెస్క్ టాప్ వెబ్ యాప్ ( Desktop web app )లో మ్యూజిక్ ఆఫ్ లైన్ డౌన్లోడ్లు యూట్యూబ్ మ్యూజిక్ యొక్క 10- పరికరాల డౌన్లోడ్ పరిమితి ఉంటుంది.ఇక కనీసం 30 రోజులకు ఒకసారి తమ పరికరాన్ని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయాలి లేదంటే ఆఫ్లైన్ డౌన్లోడ్ల గడువు ముగుస్తుంది.
యూట్యూబ్ మ్యూజిక్ డెస్క్ టాప్ యాప్ లో పాటలను డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా.డెస్క్ టాప్ లో యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ను ఓపెన్ చేయాలి.ఆ తర్వాత సింగిల్ పేజీ లేదంటే ఆల్బమ్ కు వెళ్లాలి.అక్కడ లైబ్రరీ కి సేవ్ చేసి, మూడు-డాట్ డ్రాప్ డౌన్ మెనూలో కనిపించే డౌన్లోడ్ అనే బటన్ కోసం సర్చ్ చేయాలి.
ఆ తర్వాత ఆల్బం లేదా సింగిల్ ను సేవ్ చేయడానికి డౌన్లోడ్ ఎంపికపై క్లిక్ చేయాలి.ఇక యూట్యూబ్ మ్యూజిక్ మొబైల్ యాప్ లో ఏ విధంగా పాటలు డౌన్లోడ్ చేసుకుని వింటాము అదే విధంగా వెబ్ లో కూడా డౌన్లోడ్ చేసే అన్ని పాటలు వినియోగదారు లైబ్రరీలోని డౌన్లోడ్లు ట్యాబ్ లో కనిపిస్తాయి.ఆల్బమ్ లు, ప్లే జాబితాలు, పాడ్ క్యాస్ట్ లు క్రమబద్ధీకరించడానికి ఈ ఫీచర్ అనుమతి ఇస్తుంది.అంతే కాదు ఈ ఫీచర్ క్రోమ్, ఫైర్ ఫాక్స్,ఎడ్జ్, ఓపెరా బ్రౌజర్లకు అనుకూలంగా ఉంటుంది.