సాధారణంగా జింకలు, దుప్పి ఆవులు కంటే ఎక్కువ ఎత్తు ఉండవు.5 అడుగుల ఎత్తులోపే ఇవి కనిపిస్తుంటాయి.కానీ తాజాగా అలస్కాలో దాదాపు ఏనుగు ఎత్తు ఉన్న ఒక దుప్పి కనిపించింది.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.@TheFigen_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.అలస్కాలోనే ఇదే అతిపెద్ద దుప్పి అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.
ఈ అలాస్కాన్ దుప్పి( Alaska Moose)ని కొందరు కారులో ఫాలో అవుతూ వీడియో తీయడం మనం వైరల్ ట్రిప్ లో గమనించవచ్చు.ఈ దుప్పి చాలా పెద్దగా భారీ నిర్మాణంతో కనిపించింది.
ఒక ఎస్‌యూవీ కంటే పెద్దగా అది ఉండి ఆశ్చర్యపరిచింది.సాధారణంగా ఈ అలాస్కాన్ దుప్పి మగవి అయితే భుజం వద్ద 6.9 అడుగుల పొడవు పెరుగుతాయి.700 కిలోల వరకు బరువు ఉంటాయి.ఈ పరిమాణం బరువు దాదాపు ఏషియన్ ఏనుగులకు సమానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.ఇవి దక్షిణ మధ్య, ఆగ్నేయ అలాస్కా, అలాగే కెనడా, యుకాన్ టెరిటరీలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి.

ఈ దుప్పి పూర్తిగా శాకాహారి.ఇది వివిధ రకాల మొక్కలను తింటూ బతుకుతుంది.తోడేళ్ళు, ఎలుగుబంట్లు(Bears ) వీటిపై ఎక్కువగా దాడులకు పాల్పడుతుంటాయి.ఈ దుప్పి గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు.నీటిలో 20 మీటర్ల లోతులో 30 సెకండ్ల పాటు కూడా ఉండగలదు.

నిజానికి అలాస్కాలో ఇంతకంటే పెద్ద దుప్పిలు ఉండేవి.1897 సెప్టెంబరులో పశ్చిమ యుకాన్‌లో “మూస్ మూస్” అనే బుల్ దుప్పి కెమెరాకి చిక్కింది.అప్పుడు దాని భుజం వద్ద 7.6 అడుగుల పొడవు ఉంది.దాని బరువు 1,808 పౌండ్లు.







