కోతి పైకి రాయి విసిరేందుకు చూసినా వ్యక్తికి షాక్ ఇచ్చిన కోతి.. వీడియో వైరల్..

ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రజలు ఎన్నో ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తూనే ఉంటారు.

కొన్ని వీడియోలలో మనం ఊహించిన దాని కన్నా వేరే లెవల్లో ఉండే సన్నివేశాలని మనం చూస్తాం.

ఇలాంటి వీడియోలు చూసినప్పుడు చాలామంది ప్రజలు షాక్ కి గురవుతుంటారు.అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A Monkey Shocked A Man After Seeing A Monkey Throw A Stone At Him Video Viral ,

ఒక వ్యక్తి తన ఇంటి దగ్గరకు వచ్చిన కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టాలని దాని మీదకు ఒక రాయిని విసరడానికి కిందకి వంగి ఆరాయిని తీయాలని చూస్తాడు.అయితే అప్పుడు ఆ కోతి ఏం చేసిందో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఒక వ్యక్తి దాని మీదకు రాయి విసిరేందుకు కిందకు వంగి రాయిని తీసుకుంటున్నాడని గమనించిన ఆ కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకింది.

Advertisement

దీంతో అతడు అదుపు తప్పి కిందపడ్డాడు.ఆ షాక్‌ నుంచి అతడు తేరుకుని పైకి లేచి కోతి కోసం అటూ ఇటూ చూస్తాడు.

అయితే అప్పటికే అది అక్కడి నుంచి దూరంగా పారిపోతుంది.ఒక ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇప్పటికే ఈ వీడియోను ఐదు లక్షల మందికిపైగా చూశారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా, దాని పేరు జాన్‌ సేన అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఆ కోతి అతడికి బలే షాక్‌ ఇచ్చిందని కొందరు ఇమోజీలతో కూడిన కామెంట్లు చేస్తున్నారు.అది గాల్లో ఎగిరి మెడలు విరగొట్టే కోతి అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు ఈ కోతి డబ్ల్యూడబ్ల్యూఈని ప్రతి రోజు చూస్తుందని ఒకరు చమత్కారంగా కామెంట్లు చేస్తున్నారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు