కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది.ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటన చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎమ్మెల్యే వంశీ సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వంశీ ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా డ్యామేజ్ కావడంతో కాన్వాయ్ లోని మరో రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో ఎక్కువగా దెబ్బతిన్న వాహనాన్ని అక్కడే వదిలి మిగిలిన వాహనాలతో ఎమ్మెల్యే వంశీ హైదరాబాద్ కు వెళ్లారు.
.