సోషల్ మీడియా( social media )లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు.ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
తాజాగా ఆ తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే దాదాపు ఒకట్రెండేళ్ల వయసున్న చిన్నారిని ఒక వ్యక్తి ఎత్తుకోవడం చూడవచ్చు.తర్వాత ఆ చిన్నారిని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్( Swimming pool ) లో విసిరి వేయడం మనం గమనించవచ్చు.ఈ దృశ్యం చూడగానే గుండె అదురుతుంది.
ఎందుకంటే అతడు ఆ చిన్నదాన్ని బలంగానే విసిరేశాడు.ఆ నీళ్లలో చిన్నారి మునిగిపోవడం క్షణాల్లోనే జరుగుతుందని భయం వేసింది.
కానీ ఆ బిడ్డకు స్విమ్మింగ్ తెలిసినట్లు ఉంది.అందుకే ఈజీగా నీళ్లలో తేలుతూ స్విమ్మింగ్ పూల్ చివరకు రాగలిగింది.
కొన్ని సెకన్ల తర్వాత ఇంకొక చిన్నారిని కూడా సదరు ట్రైనర్ స్విమ్మింగ్ పూల్ లో పడేశాడు.తర్వాత ఇద్దరు బుడ్డోళ్లు నీటిలో చేప పిల్లల్లాగా ఈత కొడుతూ ఆశ్చర్యపరిచారు.@Enezator అనే ట్విట్టర్( Twitter ) హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 50 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.15 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు బ్యాడ్ ట్రైనర్ అని తిడుతున్నారు.అంత ఎత్తు పైనుంచి చిన్నారులను నీటిలో విసిరేస్తే వారికి వాటర్ దెబ్బ తగులుతుందని కామెంట్లు చేస్తున్నారు.ఇతనొక అన్‌ప్రొఫెషనల్ కోచ్ అని ఇంకొకరు అన్నారు.

ఇంత చిన్న వయసులోనే స్విమ్ చేస్తున్నారంటే వీరు చిచ్చర పిడుగులు అని ఇంకొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.ఇది ఆస్ట్రేలియాలో జరిగినట్లు ఒకరి పేర్కొన్నారు.ఆస్ట్రేలియాలో నడవడం కంటే ముందే స్విమ్మింగ్ చేయడం పిల్లలు నేర్చుకుంటారని ఒక వ్యక్తి అన్నాడు.మొత్తం మీద ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దీనిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.







