ఒత్తిడిని క్షణాల్లో చిత్తు చేసి మైండ్ ను రిఫ్రెష్ చేసే మ్యాజికల్ డ్రింక్ మీకోసం!

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో తరచూ ఒత్తిడికి లోనవుతూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న వారు ఎందరో ఉన్నారు.ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది.

ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి.అలాగే ఒత్తిడి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

అందుకే ఒత్తిడికి గురైనప్పుడు దాన్ని అదుపులోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం.అయితే ఒత్తిడిని నివారించడానికి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.

అందులో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ కూడా ఒకటి.ఒత్తిడిని క్షణాల్లో దూరం చేసి మైండ్ మ‌రియు బాడీని రిఫ్రెష్ చేయడంలో ఈ మ్యాజికల్ డ్రింక్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

మరి ఇంతకీ ఒత్తిడిని తరిమికొట్టే ఆ మ్యాజికల్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా చిన్న బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు బీట్ రూట్ ముక్కలు, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, అర అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క, అర టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా రాక్‌ సాల్ట్ మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు, ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్స్ చేస్తే మన మ్యాజికల్ డ్రింక్‌ సిద్ధమవుతుంది.

ఈ డ్రింక్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఒత్తిడి గా ఉన్న సమయంలో ఈ మ్యాజికల్ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకోవాలి.అలా చేస్తే క్షణాల్లో ఒత్తిడి మాయం అవుతుంది.

మైండ్ మరియు బాడీ రిఫ్రెష్ అవుతుంది.కోపం చిరాకు వంటివి దూరమవుతాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అలాగే ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల నీరసం పరార్ అవుతుంది.శరీరం శక్తివంతంగా మారుతుంది.

Advertisement

పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.తలనొప్పి సమస్య సైతం దూరమవుతుంది.

తాజా వార్తలు