సైలెంట్‌గా వచ్చి కుక్కపైకి దూకిన చిరుత.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో వైరల్..

అటవీ నిర్మూలన, వ్యవసాయం, అభివృద్ధి వంటి మానవ కార్యకలాపాల కారణంగా చిరుతపులులు, పులులు ఆవాసాలు కోల్పోతున్నాయి.అలాంటి సందర్భాలలో అవి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

చిరుతలు, పులులు ఆహారం కోసం అడవి జంతువులపై ఆధారపడతాయి.అయితే, వేటాడటం, నివాస నష్టం కారణంగా అవి తినే జంతువుల సంఖ్య తగ్గుతోంది.

ఫలితంగా ఈ క్రూర జంతువులు పశువులు, పౌల్ట్రీ వంటి మానవ ప్రాంతాలలో ఆహారం కోసం వెతకడానికి వస్తున్నాయి.ఇప్పటికే జనావాసాల్లోకి ఎన్నో చిరుతలు ప్రవేశించి కుక్కలు, ఆవులను చంపేసాయి.

వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి చాలా భయాన్ని కలిగించాయి.తాజాగా ఆ కోవకు చెందిన మరో వీడియో వైరల్ గా మారింది.

A Leopard That Came Silently And Jumped On A Dog The Spine-tingling Video Is Vi
Advertisement
A Leopard That Came Silently And Jumped On A Dog The Spine-tingling Video Is Vi

వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర( Maharashtra )లోని అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో చిరుతపులి( Leopard ) దాడులు జరగడం సర్వసాధారణం.ఇక్కడ చిరుతపులులు తరచుగా ఆహారం వెతుక్కుంటూ పెంపుడు జంతువులను వేటాడతాయి.పూణేకు 80 కిలోమీటర్ల దూరంలోని జున్నార్ తాలూకాలోని నారాయణంగావ్‌లోని బగ్లోహ్రే గ్రామంలోని సీసీటీవీ కెమెరాలో అలాంటి ఘటన ఒకటి రికార్డైంది.

జనావాసాల్లోకి చొరబడిన చిరుత, బయట నిద్రిస్తున్న పెంపుడు కుక్కను చాలా సైలెంట్ గా పొంచి ఆపై దానిపై ఒక్కసారిగా దూకింది.అనంతరం దాని మెడ కొరికేసి చంపేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సీసీ టీవీలో రికార్డు అయిన డేట్ ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి 1:34 నిమిషాలకు చోటుచేసుకుంది.

A Leopard That Came Silently And Jumped On A Dog The Spine-tingling Video Is Vi

ఈ ఘటన చూసిన మరో రెండు వీధి కుక్క( Stray dog )లు దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాయి కానీ అది చిరుత అని తెలుసుకుని అక్కడినుంచి పరుగులు తీసాయి.ఇక ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు.తమ ప్రాంతంలో పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని, వాటి భద్రత, పశుసంపదపై తాము భయపడుతున్నామని చెప్పారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

అటవీశాఖ అధికారులు సైతం ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోలేదని, చిరుతను పట్టుకోవడం లేదని వాపోయారు.చిరుతను పట్టుకునేందుకు బారికేడ్లు, బోనులను ఏర్పాటు చేసి చిరుత కదలికలపై నిఘా ఉంచామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

అలాగే గ్రామస్థులు తమ పెంపుడు జంతువులను రాత్రిపూట బయట ఉంచకుండా చూడాలని, చిరుతపులిని భయభ్రాంతులకు గురిచేసేందుకు లైట్లు, సైరన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.మానవ-జంతు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, చిరుతపులి పట్టుబడిన తర్వాత సురక్షిత ఆవాసాలకు తరలిస్తామని చెప్పారు.

తాజా వార్తలు