పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ కీలక నేత..!!

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు సినిమా సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు విషెస్ తెలియజేస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషెస్ తెలియజేయగా తాజాగా బీజేపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా.

శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తలపెట్టి, బీజేపీతో జతకట్టి, మార్పు కోసం ముందుకు వెళుతున్న జనసేన అధ్యక్షులు, పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని కామెంట్ పెట్టారు.కలియుగ దైవం వెంకటేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు, మనకు విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తాను అంటూ జీవీఎల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. వీరితోపాటు చంద్రబాబు, నారా లోకేష్ ఇంకా పలువురు రాజకీయ నాయకులు మెగా కుటుంబానికి చెందిన హీరోలు.

ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Advertisement
వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ పై పడిందా ? 

తాజా వార్తలు