ఏపీలో చికిత్స అందిస్తూ యువ వైద్యురాలు కరోనాతో మృతి..!!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఆశ్రమం మెడికల్ కాలేజీలో తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం గ్రామంకు చెందిన యువ వైద్యురాలు కోవిడ్ బారినపడి మరణించడం జరిగింది.

ఆశ్రమం కాలేజీలో ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసి కరోనా రోగులకు సేవలందిస్తూ ఉంది.

ఈ క్రమంలో కరోనా బారినపడిన ఈమె గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటూ ఉంటుండగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో .ఆరోగ్యం క్షీణించటంతో ఇటీవల మృతి చెందడం జరిగింది.చాలా చిన్న వయసులోనే ఆమె మృతి చెందటంతో ఆశ్రమం కాలేజీలో అదేవిధంగా యువ వైద్యురాలు ఇంటివద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

A Junior Doctor Died Due To Covid West Godavari, Andhra Pradesh, Covid Treatment

కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలామంది వైద్యులు మరియు ప్రముఖులు మరణించడం జరిగింది.

రెండోసారి వచ్చిన కరోనా ప్రభావం వలన దేశవ్యాప్తంగా కరోనా సేవలు అందిస్తున్న వైద్యులు దాదాపు 594 మంది మరణించటం జరిగింది.కాగా చాలా చిన్న వయసులో ఈ యువ వైద్యురాలు మృతి చెందటంతో .ఈ వార్త విని చాలా మంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. చదువు పూర్తి చేసుకున్న గాని.

Advertisement

భయంకరమైన కరోనా చికిత్స విషయంలో ఇతరులకు సేవ అందిస్తూ…  చిన్న వయసులోనే అంత సేవా దృక్పథం కలిగి ఉండటం చాలా గ్రేట్ అంటూ ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యువ వైద్యురాల ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తున్నారు.

స్టామినా పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం
Advertisement

తాజా వార్తలు