నదిలో కూలిన హెలికాఫ్టర్.... ఛాపర్ లో ఉన్న ఇద్దరూ సురక్షితం

ఇటీవల విమాన ప్రమాదాలు,హెలికాఫ్టర్ ప్రమాదాలు అనేవి సర్వ సాధారణం అయిపోయాయి.న్యూయార్క్ లో తాజాగా ఒక హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది.

న్యూయార్క్ లోని హడ్సన్ నది సమీపంలో ఉన్న ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూయల్ నింపుకున్న హెలికాఫ్టర్ కొద్దీ సేపటికే గాల్లో చక్కర్లు కొట్టుకుంటూ హడ్సన్ నదిలో ఒక్కసారిగా కుప్పకూలింది.అయితే ఫ్యూయల్ నింపుకున్న తరువాత హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తిందని, దానితో పైలట్ ముందుకు వెళ్లలేక, అలానే పైకి వెళ్లలేక టోటల్ గా కంట్రోల్ తప్పడం తో నదిలో పడిపోయినట్లు తెలుస్తుంది.

దీనితో వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది,వాటర్ సేఫ్టీ అధికారులు క్షణాల్లో ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.దీనితో ఛాపర్ లో ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే అత్యవసరంగా స్పందించడం వల్లే ఛాపర్ లో ఉన్న ఆ ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.అయితే ఈ ఘటన కారణం సాంకేతిక లోపమా మరేదైనా ఉండి ఉంటుందా అన్న ఉద్దేశ్యం తో అధికారులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

తాజా వార్తలు