సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ చివరికి దారుణ హత్య..!

ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణాలకు విలువ అనేది లేకుండా పోతోంది.చిన్న చిన్న కారణాలకే దారుణమైన హత్యలకు పాల్పడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

 A Fight Between Friends Over Cigarettes Ended In A Brutal Murder , Visakhapatna-TeluguStop.com

ఒక సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ.ఆ గొడవ క్రమంగా పెరగడంతో యువకుడిని తోటి స్నేహితులు గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.సీఐ రేవతమ్మ తెలిపిన వివరాల ప్రకారం.

విశాఖ పట్నం( Visakhapatnam )లోని ఏవీఎన్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది.ఈమెకు చిన్నా అనే 17 ఏళ్ల కుమారుడు సంతానం.

అయితే చిన్నా కొద్దికాలంగా చెడు వ్యసనాల బారిన పడ్డాడు.

Telugu Andhra Pradesh, Cigarette, Visakhapatnam-Latest News - Telugu

అయితే ఈనెల 20వ తేదీ చిన్నా తన స్నేహితులతో కలిసి వినాయక చవితి( Ganesh Chaturthi ) ఉత్సవాల్లో పాల్గొని చాలా సరదాగా గడిపాడు.21వ తేదీ అర్ధరాత్రి సమయంలో చిన్నా తన నలుగురు స్నేహితులతో సరదాగా సిగరెట్ తాగుతూ.సిగరెట్ విషయంలో స్నేహితుల మధ్య చిన్న ఘర్షణ పెద్ద గొడవకు దారితీసింది.

స్నేహితులు క్షణికావేశంలో చిన్నా గొంతు కోసి హతమార్చి గోనే సంచిలో మృతదేహాన్ని దాచిపెట్టారు.

Telugu Andhra Pradesh, Cigarette, Visakhapatnam-Latest News - Telugu

తెల్లవారుజామున ఆటో డ్రైవర్ రాము( Ramu )తో వినాయక చవితి ఉత్సవ సామాగ్రిని సముద్రంలో కలపాలని బేరం కుదుర్చుకొని మృతదేహాన్ని ఆటోలో చేపలరేవు వద్దకు తీసుకెళ్లి సముద్రంలో విసిరేసి వెళ్లిపోయారు.చేపల రేవులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆటో డ్రైవర్ చిక్కాడు.ఆటో డ్రైవర్ ను విచారించగా నలుగురు పిల్లల గురించి చెప్పాడు.

శనివారం నలుగురు పిల్లలను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఆ నలుగురు పిల్లలను జువైనల్ హోం కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube