ఎంఎస్ ధోనీకి స్టేడియాన్ని బహుమతిగా ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్

భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ( MS Dhoni ) తన టాలెంట్, డౌన్ టు ఎర్త్ నేచర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ధోనీకి వీరాభిమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు.

వీరందరూ మహేంద్ర సింగ్ ధోనీపై అమితమైన అభిమానిని కురిపిస్తుంటారు.నిత్యం బహుమతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు.

కాగా ఇటీవల, ఒక అభిమాని అతనికి చెపాక్ స్టేడియం మినియేచర్ మోడల్‌ను బహుమతిగా ఇచ్చాడు.మిస్టర్ కూల్ దీన్ని చూసి బాగా ఫిదా అయ్యాడు.

ఇన్‌స్టా ఎంఎస్ ధోని ఎఫ్‌సీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ( Instagram )పేజీ ద్వారా షేర్ చేసిన వీడియోలో ధోని బహుమతిని చూసి ఆనందంతో మెచ్చుకున్నట్లు కనిపించింది.అతను చిరునవ్వు చిందిస్తూ మినియేచర్ మోడల్‌ పైనుంచి తన చూపు తిప్పకోలేకపోయాడు.ఈ స్టేడియంలో లైట్లు కూడా వెలగడం చూసి ధోని మంత్రముగ్ధులయ్యాడు.

Advertisement

బహుశా ధోని ఇలాంటి గిఫ్ట్ ఇంతకుముందు ఎన్నడూ అందుకోలేదేమో.అందుకే దీనిని చూస్తూనే ఉండిపోయాడు.

ఈ వీడియో సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేసిన కొంత సమయంలోనే లక్షల కొద్ది వ్యూస్‌తో వైరల్ అయింది.ఈ క్లిప్‌ను చూసిన ధోని అభిమానులు థ్రిల్‌గా ఫీల్ అయ్యారు. ఒక నెటిజన్ ధోనీ ఆనందాన్ని చూసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, "వావ్.

ఆ చిరునవ్వును చూడు" అని రాశారు.మరొక అభిమాని, "బ్యూటిఫుల్" అని కామెంట్ చేశారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి
Advertisement

తాజా వార్తలు