చెప్పులు పాడయ్యాయని కేసు పెట్టిన కస్టమర్... ఆ కంపెనీ ఎంత చెల్లించిందో తెలిస్తే షాక్ అవుతారు?

కొన్ని కొన్ని వార్తలు వింటే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది.అలాంటి సమస్యలు మనలో అనేకమందికి ఎదురవుతాయి.

కానీ దాదాపు ఇక్కడ చాలా మంది చూసీచూడనట్టు వెళ్లిపోతుంటారు.కానీ కొంతమంది మాత్రం తమకు జరిగిన ఏ ఒక్క చిన్న అన్యాయాన్నైనా చూస్తూ ఊరుకోరు.

దానికి తగిన మూల్యాన్ని ఎదుటి వ్యక్తులనుండి పొందే వరకు పోరాటం చేస్తూ వుంటారు.తాజాగా ఓ వ్యక్తి రూ.1899 చెల్లించి సో కాల్డ్ కంపెనీ చెప్పులు కొనుకున్నాడు.తీరా చూస్తే తర్వాతి రోజుకే ఆ చెప్పులు పాడైపోయాయి.

దీంతో అతను వీరావేశంతో షోరూంకు వాటిని తీసుకెళ్లి ఇచ్చాడు.కాగా వారు 10 రోజుల్లో వాటిని బాగు చేస్తామని చెప్పి తీసుకున్నారు.

Advertisement
A Customer Who Filed A Case For Damaged Slippers Would They Be Shocked To Know

దాంతో అతగాడు అర్ధం చేసుకొని అక్కడినుండి వెళ్ళిపోయాడు.అయితే 10 రోజులు కావస్తున్నా వారినుండి ఎలాంటి స్పందనా ఉండదు.

దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాడు.విచారించిన న్యాయమూర్తి సదరు షోరూం నిర్వాహకుడికి సదరు చెప్పుల మొత్తం కంటే ఎక్కువ జరిమానా విధించారు.

A Customer Who Filed A Case For Damaged Slippers Would They Be Shocked To Know

వివరాల్లోకి వెళితే, ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన నిశాంత్ గుప్తా ఈ ఏడాది ఆగస్టు 1న షౌకత్‌ అలీ రోడ్డులోని ఓ రిటైల్‌ షోరూమ్‌లో ఆ సో కాల్డ్ కంపెనీకి చెందిన చెప్పులను కొన్నాడు.వాటి ఖరీదు 1899 రూపాయిలు.అంత ఖరీదైన చెప్పులు కూడా ఒక్కరోజుకే పాడైపోవడం అతగాడిని కలచి వేసింది.

ఆ తరువాత ఆ షోరూం నిర్వాహకుల నిర్వాకానికి కోపమొచ్చి నిశాంత్ అక్టోబర్ 12న తన న్యాయవాది ద్వారా వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాడు.విచారించిన న్యాయమూర్తి సదరు షోరూం నిర్వాహకుడికి నోటీసులు జారీ చేసి, చెప్పుల ధర రూ.1899తో పాటు ఫోరం పరిహారం కింద రూ.2వేలు, ఫిర్యాదు ఖర్చుగా రూ.5వేలు చెల్లించాలని వారికి ఆదేశించింది.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు