ఆ ఒక్క డిష్ కోసం 9 ఏళ్లలో ఏకంగా రూ.32 లక్షలు ఖర్చుపెట్టిన చైనీస్ మహిళ..

చాలామంది టేస్టీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు.కొందరు తిండికే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు.

 A Chinese Woman Spent Rs. 32 Lakhs In 9 Years For That One Dish , Hotpot, Haidil-TeluguStop.com

ఈ జన్మమే చూడడానికి దొరికెరా అన్నట్లు జీవితంలో సగం డబ్బులు ఫుడ్ ఐటమ్స్ కు కేటాయిస్తారు.అయితే తాజాగా ఒక మహిళ తొమ్మిదేళ్లపాటు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ వాటికోసం ఏకంగా రూ.32 లక్షల ఖర్చు పెట్టింది.

వివరాల్లోకి వెళ్తే, చైనాకు చెందిన కాంగ్ అనే హోటల్ మేనేజర్, హైదిలావ్( Haidilao ) అనే ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ నుంచి తనకు ఇష్టమైన వంటకం హాట్‌పాట్ తినడానికి తొమ్మిదేళ్లుగా సుమారు రూ.32 లక్షలు ఖర్చు చేసింది.ఆమె అక్కడ 627 సార్లు భోజనం చేసిందని, ఇది తన ఏకైక అభిరుచి అని చెప్పింది.

హాట్‌పాట్ అనేది చైనాలో( China ) ఒక పాపులర్ ఫుడ్, ఇందులో టేబుల్ మధ్యలో ఉడకబెట్టిన పులుసులో ముడి పదార్థాలను వండుతారు.హైడిలావ్ స్పైసీ సిచువాన్ ఫుడ్, అద్భుతమైన సేవకు ప్రసిద్ధి చెందింది.

ఈ రెస్టారెంట్ ఫ్రెష్‌ ఫుడ్స్, ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని కాంగ్ చెప్పింది.

ఎక్కువ హాట్‌పాట్ తినడం తన ఆరోగ్యం, బరువును ప్రభావితం చేసిందని కాంగ్ అంగీకరించింది.ఆమె 13.5 కిలోల బరువు పెరిగింది.ఆమె బాడీ చెకప్ చేయించుకోగా, కొన్ని అసాధారణ అనారోగ్య సంకేతాలు కూడా ఉన్నాయని తేలింది.శరీరంలో లిథిక్ యాసిడ్( Lithic acid ) అధికంగా ఉండటం వల్ల గౌట్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె చెప్పారు.

ఆమె తన హాట్‌పాట్ వినియోగాన్ని తగ్గించుకోవాలని యోచిస్తోంది.కానీ దాని రుచిని ఆమె మర్చిపోలేకపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube