వైరల్: 'జూ'కు వెళ్లిన సందర్శకులపై రాళ్ళు రువ్విన చింపాంజీ... యాజమాన్యం రియాక్షన్ ఇదే!

జూ అంటేనే రకరకాల జంతువులకు నిలయం.ఇక మనలో చాలామంది తమ ఫ్యామిలీతో… ముఖ్యంగా పిల్లలను తీసుకొని వీకెండ్లో అలా సరదాగా జూకి వెళ్తూ వుంటారు.

 A Chimpanzee Who Threw Stones At Visitors This Is The Owner's Reaction , Zoo-TeluguStop.com

ఇలా వెళ్ళినపుడు ఒక్కోసారి జూలో చాలా గమ్మత్తైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి.ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంటుంది కనుక ఆయా శారద సన్నివేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ వుంటారు.

దాంతో అవి కాస్త వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఓ సరదా సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో( Social media ) తెగ హల్ చల్ చేస్తూ అందరి కంట బడింది.

సాధారణంగా కోతులకు చింపాంజీలకు( Chimpanzee ) మధ్య రూపంలో వత్యాసం వున్నప్పటికీ వాటి ప్రవర్తన మాత్రం ఇంచుమించు ఒకలా ఉంటుంది.ఓ చింపాంజీ పిల్ల కోతి వేషాలు వేస్తూ జూకు వచ్చిన సందర్శకులపై రాళ్ళు రువ్వడం మొదలు పెట్టింది.దాంతో సందర్శికులు కొందరు ఆనందపడుతుంటే… కొంతమంది మాత్రం ఆ రాలు తమమీద ఎక్కడ పడిపోతాయి అని తెగ భయపడిపోతున్నారు.అయితే ఇంతలోనే ఒక గమ్మత్తైన విషయం జరిగింది.

ఆ ఆకతాయి చింపాంజీ పిల్ల చేసిన ఆకతాయి పనికి పక్కనే వున్న పెద్ద చింపాంజీ అక్కడే దొరికిన కర్ర తీసుకుని పిల్ల చింపాంజీ వీపు మీద ఒక్కటి ఇస్తుంది.

ఈ సన్నివేశం మాత్రం ఎవ్వరూ ఊహించనిది.పెద్ద చింపాంజీ పిల్ల చింపాంజీని అలా బెత్తం తీసుకుని కొడుతున్నప్పుడు అక్కడ కొందరు ఫోటోగ్రాఫర్లు వీడియో తీయడం జరిగింది.సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్( Twitter ) అకౌంట్లో ఈ వీడియో షేర్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ‘జంతువులు కూడా మనలాగే బిహేవ్ చేస్తాయి అనడానికి ఇదే నిదర్శనం’ అని కొందరు కామెంట్ చేస్తే….‘పిల్లలకు మంచి నడవడిక నేర్పేది తల్లిదండ్రులే.ఈ చింపాంజీ అదే చేసింది’ అని కొంతమంది కామెంట్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube