టెక్నాలజీ( Technology ) అనేది ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది.కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తూనే ఉంటాయి.
ఇవి మన పనిని మరింత సులువు చేస్తూ ఉంటాయి.దీని వల్ల అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అర్టిషీషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా పాపులర్ అవుతోంది.ఈ టెక్నాలజీ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా.
ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది.ఛాట్ జీపీటీ రాకతో ఏఐ గురించి బాగా చర్చ జరుగుతోంది.

అయితే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఏర్పడుతుందని, ఇది ప్రమాకరంగా మారే అవకాశముందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే ఏఐ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుంది.దీని వల్ల చాలామంది ఉద్యోగులు కోల్పోతున్నారు.దీంతో ఏఐ మరింత విస్తరిస్తే మానవుడి మనగడకే ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.నష్టాలు కూడా అలాగే ఉన్నాయని చెబుతున్నారు.
ఏఐ వల్ల కంపెనీలకు లాభం జరగనుంది.పనులు వేగంగా అవడంతో పాటు ఉద్యోగుల కొరత సమస్య ఉండదు.
ఏఐ వల్ల రోబోటిక్ సర్జరీ( Robotic surgery ), బాంబ్ దిఫ్యుజ్ చేయడం లాంటివి చేయవచ్చు.

అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం వల్ల నిరుద్యోగులు పెరుగుతారు.దీని వల్ల మనుషుల్లో క్రియేటివిటీ కూడా తగ్గుతుందని, మనుషులు బద్ధకంగా తయారైపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎథిక్స్, ఎమోషన్స్ లాంటివి ఉండవంటున్నారు అయితే కొంతమంది మాత్రం ఏఐ ఉపయోగించుకుని పూర్తిగా మనుషులు చేసే పనులు చేయలేమని, టెక్నాలజీలో వస్తున్న మార్పులుగానే దీనిని చూడాలని చెబుతున్నారు.
మనిషిని రీప్లేస్ చేసే విధంగా ఉంటుందని అనుకోవడం నిజం కాదని అంటున్నారు.కొంతమంది సైంటిస్టులు ప్రమాదకరమని చెబుతుండగా.మరికొంతమంది మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు.దీంతో భవిష్యత్తులో అర్టిపీషియల్ ఇంటెలిజెన్స్( Artificial intelligence ) వల్ల ఎలాంటి నస్టాలు ఉంటాయో చూడాలి.