సింగపూర్ బ్యాంకులో చీటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన 19ఏళ్ల ఎన్నారై..

భారతీయ సంతతికి చెందిన మథన రాజ్ సింగ్(, Mathana Raaj Singh) (19) సింగపూర్‌లో(Singapore) ఒక బ్యాంక్‌లో మనీ లాండరింగ్‌కి తన అకౌంటు డీటెయిల్స్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు.మథన రాజ్ బ్యాంక్ కంప్యూటర్ సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ను పొందేందుకు అబద్దాలాడాడు.

 A 19-year-old Nri Caught Cheating In A Singapore Bank , Indian-origin, Singapore-TeluguStop.com

బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ ఇవ్వడం ద్వారా క్యాష్ లోన్ పొందచ్చనే విషయాన్ని టెలిగ్రామ్ యాప్‌లో తెలుసుకున్న తర్వాత ఈ పని చేశాడు.సింగ్ యునైటెడ్ ఓవర్‌సీస్ బ్యాంక్ (UOB)లో బ్యాంక్ అకౌంట్ తెరిచి, ఇతరులను ఉపయోగించడానికి డీటెయిల్స్ అన్ని ఇచ్చేశాడు.

తాను తెరిచే అకౌంట్‌ను మేనేజ్ చేసేది తాను మాత్రమేనని సింగ్ నమ్మ బలికి బ్యాంకును మోసం చేశాడు, ఆపై తన ఐ-బ్యాంకింగ్ లాగిన్ క్రెడెన్షియల్స్ తనకు తెలియని వారికి ఇచ్చి, అనుమతి లేకుండా UOB కంప్యూటర్ సిస్టమ్‌లో ట్రాన్సాక్షన్లు నిర్వహించేలా చేశాడు.సింగ్ తెరిచిన UOB అకౌంట్ 2,49,000 కంటే ఎక్కువ సింగపూర్ డాలర్లను లాండరింగ్ చేయడానికి ఒక క్రిమినల్ సిండికేట్ ఉపయోగించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.అంటే పెద్ద ఎత్తున డబ్బులు తన అకౌంట్ నుంచే అక్రమ రవాణా చేసేందుకు ఈ టీనేజ్ బాయ్ అనుమతించాడు.

చట్టపరమైన సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగ్ తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు.బ్యాంక్ కంప్యూటర్ సిస్టమ్‌కు(Bank computer system) అనధికారిక యాక్సెస్‌ను పొందేందుకు తెలియని వ్యక్తిని ప్రోత్సహించినందుకు అతను దోషిగా తేలితే, అతనికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.ఈ టీనేజ్ ఎన్నారై ఏప్రిల్ 6న కోర్టుకు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube