పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాజల్ హీరోయిన్గా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది అని చెప్పక తప్పదు.
‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు కోట్లు దాటాయి.దాంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను రికార్డు మొత్తంలో డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు.
అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో సగాన్ని కూడా రాబట్టుకోలేక పోయారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడిలో ఇప్పటి వరకు సగం వచ్చిందని, లాంగ్ రన్లో ఆ సగం రావడం కష్టమే అని, తీవ్ర నష్టాలు తప్పవు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.ఒక్క నైజాం ఏరియాలోనే కాకుండా పలు ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితిని డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అందుతోంది.
నిర్మాతలు మాత్రం ఈ సినిమాతో పెద్దగా నష్టపోలేదు అని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.తమకు పవన్ న్యాయం చేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు.అయితే పవన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడు అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది.







