ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ?

దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించిన బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ హత్యకేసు మరో మలుపు తీసుకుంది.ఈ కేసులో ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ రాజ్ సింగ్, తనకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోర్టుకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో, కేసును తాను వాదించబోనంటూ న్యాయవాది నీరజ్ గుప్తా స్పష్టం చేశారు.

 What About Pratyusha’s Boy Friend?-TeluguStop.com

ఈ కేసులో రాహుల్ నిజాలను దాస్తున్నాడని, తనకు అన్ని విషయాలనూ చెప్పడం లేదని ఆరోపించారు.కాగా, రాహుల్ పై ఐపీసీ సెక్షన్లు 306, 323, 504, 506 కింద బంగూర్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

రాహుల్ తమ కూతురిని కొట్టాడని ప్రత్యూష తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును పెట్టిన పోలీసులు ఆయన్ను మరింత లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్నారు.మరోపక్క రాహుల్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పై నేడు విచారణ జరుగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube