‘ముద్దుగా.’ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన 24 క్రాఫ్ట్స్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించబోతోంది.ఇంకా టైటిల్ పెట్టని ఈ ప్రొడక్షన్ నెం.2 చిత్ర ప్రారంభోత్సవం గురువారంనాడు మాదాపూర్ లోని శివాలయంలో చిత్ర యూనిట్, మిత్రబృందం సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా ఆర్.కె.టెక్నాలజీస్ సంస్థ వ్యవహరిస్తోంది.హీరోలుగా విక్రాంత్, రోషన్, ప్రీతమ్ కల్యాణ్, హీరోయిన్స్ గా నూతన తారలు అంజలి, రేష్మి నటిస్తున్నారు.ఈ చిత్రానికి నిర్మాత కృష్ణ కార్తీక్ యాదవ్ చిత్ర విశేషాలను వివరించారు.
“24 క్రాఫ్ట్స్ పతాకంపై రెండో ప్రయత్నంగా చక్కని లవ్ స్టోరీని నిర్మించబోతున్నాం.సీనియర్ కెమెరామెన్ శ్రీనివాసులరెడ్డిగారు మా చిత్రానికి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.అలాగే హీరో విక్రాంత్ కి ఇది రెండో చిత్రం.రోషన్, ప్రీతమ్ యాదవ్, అంజలి, రేష్మి.ఇంకా టాలీవుడ్ సీనియర్ నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
”
టెక్నీషియన్స్ వివరాలు వెల్లడిస్తూ.శ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు.
కీరవాణి వద్ద సహాయకునిగా పనిచేసిన మధు పొన్నాస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని తెలిపారు.
దర్శకుడు శ్రీ మాట్లాడుతూ.
ఏప్రిల్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభించి, మూడు షెడ్యూల్స్ లో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.హైదరాబాద్, నల్లమల ఫారెస్ట్, వైజాగ్, అరకు లోయల్లో టాకీ పార్టు పూర్తి చేస్తామని, పాటల చిత్రీకరణకు మలేషియా వెళ్తున్నట్లు తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడు శ్రీ చెప్పారు.








