జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ పై ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పు విసిరిన ఘటనతో గందరగోళం ఏర్పడింది.ఈ ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్న సమయంలో ఘటన జరిగింది.
కన్హయ్య మాట్లాడుతుండగా, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి, చెప్పు విసిరాడు.వెంటనే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.
మరింత ఉద్రిక్తత తలెత్తకుండా అదనపు బలగాలు మోహరించారు.చెప్పు విసిరిన వ్యక్తి ఎవరన్న విషయం తెలియాల్సి వుంది.







