పవన్‌ రిక్వెస్ట్‌ పట్టించుకోలేదు

తెలుగు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌కు క్రమ శిక్షణ ఉండదు అని మరోసారి రుజువు అయ్యింది.ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోలను పిచ్చిగా అభిమానించి, పలు సార్లు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు.

 Pawan Fans Dharna At Sardaar Audio Launch-TeluguStop.com

తాజాగా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ఆడియో వేడుక జరిగింది.ఈ ఆడియో వేడుకకు మొదట తెలంగాణ పోలీసులు అనుమతిని ఇవ్వలేదు.

దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు రంగంలోకి దిగి, మంత్రులతో చర్చలు జరిపిన తర్వాత ఆడియో ఫంక్షన్‌కు అనుమతిని ఇవ్వడం జరిగింది.దాంతో పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఆడియో వేడుకకు పాస్‌లు అందిన వారు మాత్రమే రావాలని కోరాడు.

పవన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విన్నవించినా కూడా ఫ్యాన్స్‌ పట్టించుకోలేదు

భద్రత కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో పాస్‌లు ఇవ్వడం లేదు అని, పాస్‌లు అందిన వారి వరకే, హైదరాబాద్‌ చుట్టుపక్క వారు మాత్రమే ఆడియో వేడుకకు హాజరు కావాలని పవన్‌ కోరాడు.కాని సర్దార్‌ ఆడియో వేడుకకు వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున మెగా ఫ్యాన్స్‌ వచ్చారు.

ఫ్యాన్స్‌ లేకుండా ఆడియో వేడుక ఎలా నిర్వహిస్తారు అని, తమకు పాస్‌లు ఇవ్వాలి అంటూ హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై నిరసనకు దిగారు.దాంతో కొంత ట్రాఫిక్‌కు అసౌకర్యం కలిగింది.

ఆ తర్వాత ఆడియో వేడుక జరిగిన కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద కూడా అభిమానులు ఆందోళనకు దిగారు.పాస్‌లు లేకుండా లోపలకి పంపాలని డిమాండ్‌ చేస్తూ దర్నా కూడా నిర్వహించారు.

దాంతో మెగా ఫ్యాన్స్‌లో ఎంత మేరుకు క్రమశిక్షణ ఉందో మరోసారి తేలిందని ఇతర హీరో ఫ్యాన్స్‌ అంటున్నారు.పవన్‌ అన్న మాటలను కూడా ఫ్యాన్స్‌ తుంగలో తొక్కడం బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube