పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఇష్టమొచ్చినట్లు ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు బాలివుడ్ క్రిటిక్ కేఆర్కే.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక జోకర్, ఒక కార్టూన్ అంటూ సంచలన వాఖ్యలు చేసిన కేఆర్కే … మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే వాఖ్యలు చేసాడు.
పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో విడుదల చేస్తే కుక్కలు కూడా సినిమాను చూడడానికి రావు అనేసాడు.పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో పెద్ద స్టార్ అయ్యిండొచ్చు కాని .తన సినిమాలు అక్కడే విడుదల చేసుకోవాలి, హిందీలో కాదు అన్నాడు.పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే రాజ్పాల్ యాదవ్, దీపక్ దోబ్రియాల్,పుల్కీట్ సమ్రాట్ లాంటి వాళ్ళు పెద్ద స్టార్లు అంటూ కామెడి చేసాడు.
పవన్ కళ్యాణ్ హిందీలో సైడ్ క్యారెక్టర్లు చేయడానికి కూడా పనికిరాడు అని అన్నాడు.
అనరాని మాటలు అంటే అంటున్నాడు కాని .ఇలా వ్యతిరేకంగా అయినా, కావల్సినంత పబ్లిసిటి సర్దార్ గబ్బర్ సింగ్ కి ఇస్తున్నాడు కేఆర్కే.మరి హిందీలో కూడా మంచి కలెక్షన్లు రాబట్టి.
కేఆర్కే చెంప ఛెళ్ళుమనేలా చేస్తాడా పవర్ స్టార్ అనేది చూడాలి!
.






