నిహారిక కోరికను మెగాస్టార్‌ తీర్చుతాడా?

మెగా ఫ్యామిలీ నుండి ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు ఇప్పటికే బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించి దుమ్ము రేపింది.

 Niharika Want To Act On Chiru 150th Film-TeluguStop.com

త్వరలోనే హీరోయిన్‌గా కూడా తన సత్తా చాటుతాను అంటూ ఉంది.ఈమె ‘ఒక మనసు’ చిత్రం తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతోంది.

ఇప్పటి నుండే కథల ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.మోతాదు మించకుండా గ్లామర్‌ పాత్రల్లో కూడా నటిస్తాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని ఈమె సన్నిహితులతో చెప్పుకొచ్చింది.

తన పెదనాన్న చిరంజీవి నటించబోతున్న ప్రతిష్టాత్మక 150వ సినిమాలో చిన్న పాత్రలో అయినా కనిపించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాను అని, దర్శకుడు వినాయక్‌ గారిని, చిరంజీవి గారిని పదే పదే రిక్వెస్ట్‌ చేస్తున్నట్లుగా నిహారిక చెప్పుకొచ్చింది.

పెదనాన్న చిరంజీవితో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలు అని ఈమె కోరుకుంటుంది.మరి ఈమె కోరికను దర్శకుడు వినాయక్‌ కాని, చిరంజీవి కాని పట్టించుకుని ఈమె కోసం ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్‌ చేస్తారా అనేది చూడాలి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుండగా, వచ్చే నెలలో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.నిహారిక నటించిన ‘ఒక మనసు’ చిత్రం కూడా విడుదలకు సిద్దం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube