కాంగ్రెస్ గతి కుక్క చావే ?

ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కేరళ, అస్సాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.అయితే మరోసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని సర్వే చెప్తోంది.

 Congress To Get Huge Blow?-TeluguStop.com

కేరళలో లెఫ్ట్ కూటమి, అస్సాంలో బీజేపీ కూటమి గెలవవచ్చనే వార్త కాంగ్రెస్ వారికి షాకిచ్చేదే.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో సొంత పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆ పరిణామం తర్వాత దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 8కి పడిపోయింది.అందులోనూ చాలా వరకు చిన్నా చితకా రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్ లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

ఇప్పుడు కేరళ, అస్సాంలలో కూడా ఓడిపోతే ఆ పార్టీ బలం మరింత పడిపోతుంది.అప్పుడు కర్ణాటక మినహా కేవలం చిన్న, ఈశాన్య రాష్ట్రాలకే ఆ పార్టీ అధికార బలం పరిమితం అవుతుంది.

ఇండియా టీవీ సర్వే ప్రకారం, కేరళలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 72 నుంచి 49కి పడిపోయే అవకాశం ఉంది.వామపక్ష కూటమి సీట్లు 66 నుంచి 89 పెరగవచ్చు.

ఆశ్చర్యకరంగా ఎన్డీయేకు ఒక సీటు రావచ్చని కూడా సర్వే అంచనా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube