ఆది పినిశెట్టి నటించిన థ్రిల్లర్ ‘ మలుపు ‘ విడుదల అయినట్టు కూడా ఎవ్వరికీ తెలీదు.అసలు పబ్లిసిటీ కానీ హడావిడి కానీ లేని సినిమా అది.
ప్రచారం విషయం లో ప్రొడ్యూసర్ లు దారుణమైన రచ్చ చేస్తున్న సమయంలో కూడా సైలెంట్ గా వచ్చేసింది ఈ చిత్రం.పైగా డబ్బింగ్ పిక్చర్, తమిళ్ లో ప్లాప్ అయింది కూడా.
మరి అలాంటి సినిమాల మీద జీరో అంచనాలతో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ లు కూడా .కానీ మౌత్ పబ్లిసిటీ బాగా ఒచ్చింది ఈ సినిమాకి.
పాజిటివ్ రివ్యూ లు కూడా చేరి ఈ సినిమా బాగా పికప్ అయ్యింది ప్రస్తుతం.చిత్రమేమిటంటే బీ సెంటర్లలో కూడా బాగుంది అన్న టాక్ రావడం.
దీంతో ధైర్యం చేసి, తామే డబ్ చేసి విడుదల చేసుకున్నందుకు హీరో ఆది ఫ్యామిలీకి బాగానే ఫలితం దక్కింది.తమిళ వెర్షన్ డబ్ చేయడం తప్ప, వేరే ఖర్చేమీ లేదు పెద్దగా.
హక్కులన్నీ ఆది ఫ్యామిలీవే.ఇధిగో అదిగో అని అయిదు కోట్ల వరకు వసూళ్లు సాగుస్తుందని అంచనా వేస్తున్నారు.







