ఆ హీరో ముద్దులు బాగా పెడతాడు అంటున్న హీరోయిన్

కరీనాకపూర్ మామూలు గడుసరి కాదు.నా పెళ్ళి అయిపోయింది, ముద్దు సన్నివేశాల్లో ఇక నటించేదే లేదు, ఇంకా లిప్ లాక్ సీన్లు చేస్తే తన భర్త సైఫ్ అలీ ఖాన్ కి ఇబ్బందిగా ఉంటుందని అపుడెప్పుడో స్టెట్‌మెంట్ ఇచ్చిన బేబో ఇటీవలే రీలీజ్ అయిన “కీ అండ్ కా” ఫస్ట్ లుక్ లోనూ, ట్రైలర్ లోనూ, అర్జున్ కపూర్ కి ముద్దుల మీద ముద్దులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Arjun Kapoor Is A Good Kisser – Kareena Kapoor-TeluguStop.com

వామ్మో పెళ్ళి తరువాత కూడా ఈ స్పీడ్ ఏంటి అని అంతా ఆశ్చర్యపోతుండగానే కరీనా మరో బాంబు పెల్చింది.అర్జున్ కపూర్ ముద్దులు బాగా పెడతాడు అని అతడికి కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసింది.

పెళ్ళి తరువాత ముద్దు సీన్లు చేయకూడదు అనుకున్న మాట వాస్తవమేనని, కాని కీ అండ్ కా స్క్రిప్టు డిమాండ్ చేయడంతో పాటు అర్జున్ తో ఉన్న సాన్నిహిత్యం వల్లే కిస్సింగ్ సీన్స్ చేసానని.పైగా అర్జున్ కి ముద్దులు పెట్టడం బాగా వచ్చు అని చెప్పుకొచ్చింది ఈ 35 ఏళ్ళ సుందరాంగి.

ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీది ఏం బ్యాడ్ లక్కో మరి … ముద్దుసీన్లు ఉన్నాయన్న కారణంతోనే ఇమ్రాన్ సినిమా ఒకటి వదిలేసుకుంది కరీనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube