కెసిఆర్ మనవడు , సెక్రెటేరియట్ లో హడావిడి

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్ష్ సెక్రటేరియట్ లో కనిపించడం ఇవాల్టి విశేషంగా మారింది.అప్పుడప్పుడూ కేసీఆర్ పాల్గొనే సభలూ, సమావేశాలలో ఈ బాబు కనిపిస్తూ ఉంటాడు.

 Kcr Grand Son In Secretariat-TeluguStop.com

అయితే తన తాతగారు , ముఖ్యమంత్రి కెసిఆర్ లేని సమయంలో ఈ కుర్రాడి సెక్రటేరియట్ కి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని గురించేస్తోంది.తన ఫ్రెండ్స్ తో సహా సెక్రెటేరియట్ కి వచ్చిన హిమన్ష్ సెక్రెటేరియట్ లోని మంత్రులూ -అధికారుల ఛాంబర్ లన్నీ చుట్టేసాడు.

నెమ్మదిగా తన తాత ఛాంబర్ కి చేరుకొని అక్కడ మైకు లో మాట్లాడాడు కూడా.

ఆ పిల్లాడు సెక్రెటేరియట్ లో తిరిగిన కాసేపూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తెగ హైరానా పడ్డారు.

అప్పట్లో ఒకసారి వినాయక నవరాత్రుల సందర్భంగా ఒక గణేష్ పెండాల్ లోకి పూజలు చేసి ఒక్కడు వెళ్ళాడు అప్పుడు మీడియా తనని గుర్తు పట్టి అడగగా తెలంగాణా జనాల కోసమే తన పూజలు అంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన సెక్రటేరియట్ కు రావడం… అది కూడా స్నేహితులను తీసుకొచ్చి మంత్రుల చాంబర్లు వంటివన్నీ తిరగడంపై విమర్శలొస్తున్నాయి.

ఎంత ముఖ్యమంత్రి మనవడైనా సెక్రటేరియట్ లో పిల్ల గ్యాంగ్ ను వెంటేసుకుని వచ్చి సొంత ఇలాకాలా తిరగడం సరికాదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube