దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇంటింటా అన్నమయ్య’.ఈ సినిమా గత మూడు సంవత్సరాలుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్‌లోనే పడి ఉంది.
సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేసిన తర్వాత ఏవో కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదాలు వేస్తూ వస్తున్నారు.మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అన్నమయ్య గేయాలను, ఆయన గురించి ప్రస్తుత తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కించాడు.
‘శ్రీరామ రాజ్యం’ చిత్రం నిర్మాత యలమంచిలి సాయిబాబు ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రంలో ఆయన తనయుడు రేవంత్ హీరోగా నటించాడు.రేవంత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
రాఘవేంద్ర రావు వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలకు ఇంతగా ఎదురు చూడటం గతంలో ఎప్పుడు లేదు.మరి ఇప్పుడు అయినా ఈ సినిమా విడుదల అవుతుందా అనేది చూడాలి.







