మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చే నెలలో ప్రారంభం అవ్వబోతున్న విషయం తెల్సిందే.చిరంజీవి ఆ సినిమా కోసం చాలా రోజులుగా సన్నాహాల్లో ఉన్నాడు.
ఒక వైపు సినిమాలతో పాటు మరో వైపు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో కూడా ఈయన పాల్గొంటున్నాడు.అయితే తాజాగా ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనలేదు.
రాహుల్ గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా చిరంజీవి హాజరు కాకపోవడంతో అంతా కూడా షాక్ అయ్యారు.ఆ విషయమై ఫ్యాన్స్ ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
చిరంజీవి గైర్హాజరు గురించి వాకబు చేసిన ఫ్యాన్స్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసిందట.మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడట.
భుజంకు అయిన గాయం కారణంగా చిరుకు చిన్న శస్త్ర చికిత్స చేయడం జరిగిందట.దాంతో ప్రస్తుతం చిరు హాస్పిటల్‌లో ఉన్నాడని, అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీటింగ్‌లో చిరు పాల్గొనలేదు అంటూ ఆయన సన్నిహితులు ఫ్యాన్స్‌కు చెబుతున్నారట.
ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు.ఆపరేషన్ కారణంగా చిరంజీవి సినిమా మరింత ఆలస్యం అవుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశాలున్నాయి.







