3 కోట్లకు చేరిన జగ్గూభాయ్‌

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌ జగపతిబాబు.చిన్న, పెద్ద హీరోలకు ఈయనే కావాలి.

 Jagapathi Babu Hikes His Remuneration-TeluguStop.com

‘లెజెండ్‌’ చిత్రంతో ఈయన విలన్‌గా ఒక్కసారిగా స్టార్‌ క్రేజ్‌ను తెచ్చుకున్నాడు.ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

తాజాగా ఈయన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటించి సూపర్‌ డూపర్‌ను దక్కించుకున్నాడు.ఇక ఈ చిత్రంతో మరింత క్రేజ్‌ను దక్కించుకున్న జగపతిబాబు తన పారితోషికాన్ని అమాంతం పెంచేసినట్లుగా తెలుస్తోంది.

మొన్నటి వరకు రెండు కోట్ల పారితోషికంతో నటించిన జగ్గూ భాయ్‌ తన తర్వాత సినిమా కోసం మూడు కోట్లను డిమాండ్‌ చేస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఇప్పటికే నటించేందుకు ఒప్పుకున్న సినిమాకు సైతం జగ్గూ భాయ్‌ పారితోషికం పెంచడంతో ప్రస్తుతం ఆ నిర్మాత గగ్గోలు పెడుతున్నాడట.

తన సినిమాలో మొదట రెండు కోట్లకు నటించేందుకు ఒప్పుకున్న జగపతి బాబు ఉన్నట్లుండి మరో కోటి డిమాండ్‌ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అయితే జగ్గూ భాయ్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆయన అడిగిన పారితోషికం ఇవ్వాలని సదరు నిర్మాత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇలా ఈ ఫ్యామిలీ హీరో విలన్‌గా మారిన తర్వాత కూడా స్టార్‌ హీరోల స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటూ అందరిని ఆశ్చర్య పర్చుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube