మరో సిక్స్‌ ప్యాక్‌ హీరో

‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ వారి అబ్బాయి శ్రీనివాస్‌ తాజాగా ‘స్పీడున్నోడు’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పీడున్నోడు’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Bellamkonda Srinivas Next Movie Release Date Confirmed-TeluguStop.com

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘సుందర పాండ్యన్‌’కు రీమేక్‌గా ‘స్పీడున్నోడు’ చిత్రం తెరకెక్కుతోంది.ఇక ఆ చిత్రం తర్వాత బెల్లంకొండ సురేష్‌ తన తర్వాత సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెల్సిందే.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్న చిత్రంలో ఈ బెల్లంకొండ హీరో సిక్స్‌ ప్యాక్‌తో నటించబోతున్నాడు.

టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు హీరోలు సిక్స్‌ ప్యాక్‌ చేసిన విషయం తెల్సిందే.

తాజాగా ఈ హీరో కూడా సిక్స్‌ ప్యాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటానంటున్నాడు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ హీరో గతంలోనే చిత్రం చేయాల్సి ఉంది.

ఆ సినిమా ప్రారంభం అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.మళ్లీ ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.

‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసిన అభిషేక్‌ పిక్చర్స్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత అంటే సమ్మర్‌ ప్రారంభంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమాను ప్రారంభించబోతున్నాడు.

ఆ సమయం వరకు శ్రీనివాస్‌ కండలు పెంచి సిక్స్‌ ప్యాక్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకోసం కసరత్తు సైతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube