రోడ్ల మీద చిరంజీవి ఎన్నికల ప్రచారం ?

చిరంజీవి – రాజకీయాలు ఈ రెండూ పరస్పరం అచ్చిరాని అంశాలు.చిరంజీవికి రాజకీయాలు పెట్టిన దరిద్రం ఏ ఫీల్డ్ పెట్టలేదు.

 Congress To Use Chiranjeevi For Greater Elections-TeluguStop.com

ఎన్నో బిజినెస్ లు చేసాడు , ఎన్నో సినిమాలు చేసాడు , ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు కానీ రాజకీయాలు ఆయనకి కొరకరాని కొయ్య గానే మిగిలిపోయాయి.కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీ ప్రజారాజ్యాన్ని కలిపేసి అందులో విలీనం చేసి రాజ్యసభ పదవిని అనుభవించిన చిరంజీవి అప్పట్లో సమైక్య వాది గా చెప్పుకొని తెలంగాణా లో వ్యతిరేకత ని ఎదురుకొన్నారు.

ఏపీ లో చావు పడక మీద ఉన్నకాంగ్రెస్ ని చిరంజీవి చేతిలో పెట్టింది హై కమాండ్ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోయారు.అది విభజన వలన అని ఈజీగా చెప్పచ్చు.

ఇప్పుడు గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగడం తో హైదరాబద్ సెటిలర్స్ మీద కాంగ్రెస్ చిరంజీవి ని ప్రయోగిద్దాం అని చూస్తోంది.గ్రేటర్‌లో సీమాంధ్రుల ఓట్ల ప్రభావం ఎక్కువగా వున్న డివిజన్లలో సీమాంధ్రులకే టిక్కెట్లు ఇస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రకటించేశారు.

దాంతోపాటుగా, చిరంజీవిని ప్రచారంలోకి దింపితే, సెటిర్ల ఓట్లు తమకే పడ్తాయన్నది టీఎస్‌ పీసీసీ ఆలోచన.చిరు దీనికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

నిజంగా అలా చిరు ఒప్పుకుని ప్రచారం చేసినా హైదరాబాద్ లో ఒక సమైక్య వాది అలా ప్రచారం చేస్తుంటే పక్కా తెలంగాణా అభిమానులు ఊరుకుంటారా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube