రకుల్ ప్రీత్ అంటే అదోరకం క్రేజ్ తెలుగు యువతలో.ఈ డిల్లి బ్యూటి నవ్వుకే పడిపోతారు కుర్రాళ్ళు.
సినిమాకు ప్రేక్షకులను రప్పించటంలో రకుల్ పాత్ర కుడా ఏంతో కొంత ఉంటుంది.కాని రకుల్ ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదు.తనకి ఇప్పుడే అంత సీన్ రాలేదు అంటోంది.
” నా పేరు మీద జనాలు థియేటర్లకు వస్తారా ? నేనైతే నమ్మను.నేనింకా ఆ స్థాయికి చేరుకోలేదు నాకు తెలిసి.పరిపూర్ణమైన నటిగా ఎదగలేదు నేను అప్పుడే.నటిగా పేరు వస్తేనే, నాకోసం ప్రత్యేకంగా వస్తారు.అయినా నేను ఇవన్ని పట్టించుకోవట్లేదు.
నా మనసు ఏం చెబితే అదే చేస్తున్న.కొంతకాలం తరువాత నటిగా నిరూపించుకోవాలి.
తెలుగు ప్రేక్షకులు నన్ను ఇష్టపడుతున్నారు.అదే చాలు ఇప్పటికైతే.
మిగితా విషయాలు ఇప్పుడే ఆలోచించి బుర్ర పాడుచేసుకోదలుచుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది ఈ స్మైలీ బ్యూటి.
రకుల్ నటించిన నటించిన నాన్నకు ప్రేమతో జనవరి 13న విడుదల కానుంది.
దీనితో పాటు అల్లు అర్జున్ సరైనోడు, హిందీ చిత్రం షిమ్లా మిర్చి , అమ్మడి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు.







