దేవిశ్రీప్రసాద్... హ్యాట్సాఫ్

వృత్తి నిబద్ధత అనేది అతి తక్కువ మందిలో ఉంటుంది.అలాంటేవారే ఎప్పటికప్పుడు తమని తాము మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతారు.

 Dsp Back In Work-TeluguStop.com

అలాంటి అతితక్కువ మందిలో నేనూ ఒకడ్ని అని నిరూపించుకున్నాడు దేవిశ్రీప్రసాద్.

దేవిశ్రీ నాన్న సత్యమూర్తి గారు దేహాన్ని విడిచి వెళ్ళిన సంగతి తెలిసిందే.

ఆ బాధలో దేవిశ్రీ ఉండగా, మరోవైపు నాన్నకు ప్రేమతోకి సంబంధించి చివరి పాటతో పాటు రీ-రికార్డింగ్ బ్యాలెన్స్ గా ఉండిపోయింది.సినిమా జనవరి 13 న వస్తుందని చెప్పేసారు, సమయానికి రాకపోతే చాలా నష్టం జరుగుతుంది.

కాని ఎన్టీఆర్ దేవిశ్రీతో ఇప్పుడిప్పుడే నాన్నకు ప్రేమతో గురించి ఆలోచించవద్దని, ఈ సమయంలో కుటుంబంతో సమయాన్ని గడపాలని సర్ది చెప్పాడు.కాని తన వల్ల నష్టం రాకుడదని భావించిన దేవిశ్రీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ కి ఫోన్ చేసి ” నేను మిగిలున్న పాటని పూర్తి చేస్తున్నాను.మనం అనౌన్స్ చేసిన తేదికే సినిమా విడుదల చేద్దాం.

నా వల్ల అయితే ఎలాంటి ఆలస్యం జరగదు ” అని మాటిచ్చాడట.

ఇంత దుఃఖంలో కూడా పనిచేయడం కళను ప్రేమించేవారికే సాధ్యం.

హ్యాట్సాఫ్ దేవిశ్రీప్రసాద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube