వార్‌ వన్‌ సైడ్‌ అయినట్లేనా?

నందమూరి హీరోలు బాలకృష్ణ మరియు ఎన్టీఆర్‌లు ఈ సంక్రాంతికి ఢీ కొట్టబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.వీరిద్దరు ‘డిక్టేటర్‌’ మరియు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలకు కేవలం ఒక్క రోజు గ్యాప్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Nannaku Prematho Out From Sankranthi Race..?-TeluguStop.com

ఒకరి తర్వాత ఒకరు సంక్రాంతి కానుకగా అంటూ ప్రకటనలు ఇస్తూ వచ్చారు.దాంతో ఇద్దరు నందమూరి హీరోల మధ్య బిగ్‌ వార్‌ ఖాయం అని అంతా అనుకున్నారు.

అలాంటి నేపథ్యంలో తాజాగా జరిగిన కొన్ని పరిణామాల వల్ల వార్‌ వన్‌ సైడ్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంక్రాంతి బరి నుండి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తున్న విషయం ప్రకారం మరి కొన్ని రోజుల్లో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం స్పెయిన్‌ షెడ్యూల్‌ పూర్తి అవుతుంది.ఆ షెడ్యూల్‌ తర్వాత ఇంకో షెడ్యూల్‌ కూడా ఉంటుంది.

ఆ చిత్రీకరణకు సమయం పడుతుంది.అదే విధంగా ఒక పాటతో పాటు రీ రికార్డింగ్‌ కూడా బ్యాలన్స్‌ ఉంది.

తాజాగా దేవిశ్రీ ప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి మరణించారు.ఆయన మరణంతో దేవిశ్రీ ప్రసాద్‌ కనీసం 15 నుండి 20 రోజుల వరకు వర్క్‌ చేసే అవకాశం లేదు.

దాంతో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రీ రికార్డింగ్‌ పనులతో పాటు పాట కూడా ఆగి పోతుంది.అందువల్ల సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు లేక పోలేదు అని సమాచారం అందుతోంది.

అందువల్లే వార్‌ వన్‌ సైడ్‌ అయినట్లే అంటూ నందమూరి ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube