రాష్ట్రాల్లో అసేబ్లీలు, దిల్లీలో పార్లమెంటు ఉన్నది ప్రజా సమస్యలపై చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి.కానీ కాలక్రమంలో పార్లమెంటు , రాష్ట్ర చట్ట సభలు ప్రజలతో, ప్రజా సమస్యలతో సంబంధాలు లేకుండా పనిచేస్తున్నాయి.
అవి నినాదాన్ని పంచిపెట్టే వేదికలుగా మారాయి.ప్రధానంగా పార్లమెంటు పార్టీల నాయకులు కొట్టుకోవడానికి , తిట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతోంది తప్ప అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ప్రస్తుత శీతా కాల సమావేశాలైనా సజావుగా జరుగుతాయని భావించారు.కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని , నెహ్రూ -గాంధీ కుటుంబాన్ని బీజేపీ సభ్యడు వీరేంద్ర సింగ్ అనరాని మాటలు అన్నాడని ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి సభను జరగనివ్వడం లేదు.ఈ రోజు కూడా కాంగ్రెస్ సభ్యలు తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ , జేడీయూ సభ్యలతో కలిసి వాకవుట్ చేశారు.
రాహుల్ గాంధీని మాటలతో అవమానించిన వీరేంద్ర సింగ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.సభ ప్రారంభం కాగానే నినాదాలు చేశారు.
ప్లకార్డులు ప్రదర్శించారు.వీరేంద్ర సింగ్ అపాలజీ చెప్పాలని సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.
సభలో ఎంత గొడవ చేసినా బీజేపీ సభ్యుడు అపాలజీ చెప్పకపోవడంతో కాంగ్రెస్ సభ్యులతో ఇతర పార్టీ సభ్యులు కూడా నిరసనగా వాకవుట్ చేశారు.







