డైరెక్టర్ విక్రమ్ కుమార్ మంచి స్వింగ్ లో ఉన్నారు.ఇష్క్, మనం చిత్రాలతో అందరి మన్ననలు పొందిన ఈ దర్శకుడు ప్రస్తుతం సూర్యతో సైన్స్ ఫిక్షన్ 24 తెరకెక్కిస్తున్నారు.
రెండు ఏళ్లుగా మహేష్ డెట్స్ కోసం ఎదురుచూస్తున్న ఈ దర్శకుడితో సినిమా చెసేందుకు ఒప్పుకున్నాడు సూపర్ స్టార్.అయితే ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం పడుతుంది.
బ్రహ్మోత్సవం తరువాత మురగదాస్ తో మహేష్ బిజి అయిపోతాడు కాబట్టి, 2017 వరకు ఈ ప్రాజెక్టు గురించి మరచిపోవాల్సిందే.
మరి 24 తరువాత మహేష్ కోసం ఎదురుచూస్తూ విక్రమ్ ఖాలిగా ఉంటాడా అంటే, కానే కాదు.
ఈ గ్యాప్ ని అల్లు అర్జున్ తో భర్తి చేస్తాడు విక్రమ్.
విక్రమ్ చెప్పిన కథ అల్లు అర్జున్ కి విపరీతంగా నచ్చేసిందట.
ఎంతో సంతృప్తికరంగా ఈ చిత్రాన్ని బన్ని ఒప్పుకున్నాడని వినికిడి.సరైనోడు తరువాత అల్లు అర్జున్ మొదలుపెట్టే సినిమా ఇదే అంటున్నారు.







