గత కొన్ని రోజులుగా చెన్నై నగరం అకాల వర్షాలతో తల్లడిల్లిపోతుంది.ఇప్పటినే 70మంది వరదల కారణంగా చనిపోయారు.
ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు.ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు.
చాలా మంది నటీనటులు ప్రజలకు తమ వంతుగా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు అల్రెడి తమ వంతుగా ఐదేసి లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు.
ఇప్పుడు వారి బాటలోనే రజనీకాంత్ వరద బాధితుల కోసం తన సపోర్ట్ ను అందించడానికి ముందుకు వచ్చారు.
సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయడానికి రజనీకాంత్ ఎప్పుడూ ముందుంటారు.
తన వంతుగా ఎంతో కొంత ఫండ్ ఇస్తుంటారు.మన విశాఖనగరంలో హుదూద్ తుఫాన్ కారణంగా కలిగిన నష్టానికి కూడా అప్పట్లో ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించాడు.
అలాగే ఇప్పుడు చెన్నై వరద బాధితుల కోసం సి.ఎం.రిలీఫ్ ఫండ్‌కు తన వంతుగా శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిట్రబుల్ ట్రస్ట్ తరపున పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.







