మెగా హీరో వరుణ్ తేజ్ మూడవ సినిమా ‘లోఫర్’ విడుదలకు సిద్దం అయ్యింది.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ చిత్రానికి ముందు వరుణ్ తేజ్ చేసిన ‘కంచె’ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ అవుతోంది.దానికి తోడు పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో భారీగానే ఉన్నాయని ట్రైలర్ మరియు పోస్టర్‌లు చూస్తుంటే అర్థం అవుతోంది.
ఈ సినిమాకు పెట్టిన పెట్టిబడి నిర్మాతకు విడుదలకు ముందే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం నైజాం ఏరియాలో 7.5 కోట్లకు అమ్ముడు పోయి అందరిని ఆశ్చర్య పర్చుతోంది.ఒక కొత్త హీరో, యువ హీరో చిత్రం ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోవడం అంటే మామూలు విషయం కాదు.
అది పూరి వల్ల సాధ్యం అయ్యింది.నైజాం ఏరియాతో పాటు అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆన్‌లైన్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్ని కలిపితే ఈ చిత్రం దాదాపుగా 35 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ టాక్.ఈ చిత్రం పూరి జగన్నాధ్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాలు అయిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ మరియు ‘పోకిరి’ చిత్రాలను పోలి ఉంటుందని అంటున్నారు.
భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు తల్లి సెంటిమెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అలాగే హీరో మరియు హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా యూత్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు పూరి తెరకెక్కించాడట.ఇక ఈ సినిమాను వచ్చే నెల రెండవ వారంలో విడుదలకు సిద్దం చేస్తున్నారు.







