వరుస డిజాస్టర్స్ తో అభిమానుల్ని బాధపెట్టిన మహేష్ బాబు ఒకే ఒక్క దెబ్బతో లెక్కలన్నీ సరిచేసాడు.మహేష్ బాబు కి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ ఎలా పరుగులు పెడుతుందో శ్రీమంతుడు తో మరోసారి నిరూపించాడు సూపర్ స్టార్.
అయితే బాక్సాఫీస్ లెక్కలను సరిచేసిన మహేష్ కి మరో రికార్డు సవాలు విసురుతోంది.ఈ రికార్డు కూడా మహేష్ జేబులో వేసుకోవాలని ఆశపడుతున్నారు సూపర్ ఫ్యాన్స్.
ఇంతకీ ఏం రికార్డు అది అనుకుంటున్నారా ? టీ.ఆర్.పి రికార్డ్స్ .ఒక సినిమా ప్రిమియర్ టీవీలో వస్తే చూస్తున్న జనాభాని బట్టి రేటింగ్స్ వస్తాయి.ప్రస్తుతం నాగార్జున శ్రీరామదాసు తెలుగు సినిమాల్లో రికార్డు రేటింగ్స్ తో మొదటి స్థానంలో ఉంది.24 పాయింట్స్ సాధించింది శ్రీరామదాసు.ఇక రెండోవ స్థానంలో 22.70 రేటింగ్స్ తో మగధీర ఉంది.బాహుబలి 21.84 రేటింగ్స్ తో మూడోవ స్థానాన్ని సరిపెట్టుకుంది.మొదటి మూడు స్థానాల్లో సాగుతున్న చిత్రాలని గమనించి చుస్తే, టివి వరకు హీరో క్రేజ్ కన్నా సినిమా ఎలా ఉంది అనేది ముఖ్యం అని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇవాళ సాయంత్రం జీ తెలుగులో ప్రసారం కానుంది శ్రీమంతుడు.
మరి మహేష్ టీవిలో కుడా మెరుస్తాడా ? ఇక్కడ కుడా రికార్డులు బద్దలు కొడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.







