తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారంలోకి రాగానే ఒక మంచి ప్రయోగం చేశారు.ఈ ప్రయోగం పేరే షీ టీమ్స్.
అమ్మాయిలను, మహిళలను టీజ్ చేసే , వేధించే ఆకతాయిల పని పట్టడం కోసం అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా నేతృత్వంలో గత ఏడాది షా టీమ్స్ ఏర్పాటు చేశారు.ఈ ప్రయోగం ఏడాది పూర్తీ చేసుకుంది.
ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతం అయింది అని ప్రశ్నించుకుంటే విఫలం కాలేదని జవాబు చెప్పుకోవచ్చు.ఈ ఏడాది కాలంలో అమ్మాయిలను వేధించిన 281 మందిని పట్టుకున్నారు.
వారిలో 19 మందిని జైలుకు పంపారు.పట్టుకున్న వారిని జైలుకు పంపడం కంటే కౌన్సెలింగ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
వారి మైండ్ సెట్ మారితే అమ్మాయిలను ఏడిపించడానికి ప్రయత్నించారు.పట్టుపడిన వారిలో కొందరు మధ్య వయసు వారు, ముసలివారు కూడా ఉన్నారంటే విస్మయం కలుగుతుంది.
బుద్ధి పెడతోవ పడితే ఏ వయసు వారైనా పిచ్చి పనులు చేస్తారు.హైదారాబాదులో షీ టీమ్స్ పట్ల ఇటు యువతులకు, మహిళలకు అటు మగ వారికి ప్రధానంగా కుర్రకారుకు అవగాహన పెరిగింది.
తమను వేధించే వారి సమాచారాన్ని అమ్మాయిలు వెంటనే షీ టీమ్స్ కు అందిస్తున్నారు.యువకులు కూడా భయపడుతున్నారు.
షీ టీములను మరింత పటిష్టం చేసి మహిళలకు రక్షణ పెంచాలి.మొత్తం మీద కెసీఆర్ సర్కారు ప్రయోగం వృధా పోలేదు.







